Fri Dec 05 2025 11:15:24 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మేకపాటి అంత్యక్రియలు
కపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. యువమంత్రి హఠాన్మరణంతో సింహపురి శోకసంద్రంగా మారింది. గౌతమ్ రెడ్డి కుమారుడు అమెరికా నుంచి రాత్రి నెల్లూరుకు చేరుకున్నారు. నేడు ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.
ఆత్మకూరు వాసులు....
మేకపాటి గౌతమ్ రెడ్డి పార్ధీవ దేహానికి రాజకీయాలకు అతీతంగా పలువరు నేతలు నివాళుర్పించారు. ఆయన పార్దీవదేహాన్ని చూసి ప్రధానంగా ఆత్మకూరు ప్రజలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సౌమ్యుడు, అందరివాడుగా పిలుచుకునే గౌతమ్ రెడ్డి ఇకలేరనే వార్తను ఆత్మకూరు నియోకవర్గం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్కక్రియలకు ముఖ్యమంత్రి జగన్ తో పాటు పలువరు మంత్రులు హాజరుకానున్నారు.
Next Story

