Thu Mar 19 2026 07:41:46 GMT+0530 (India Standard Time)
వర్మ ఓ వెధవ : నాగబాబు ఫైర్
రాంగోపాల్ వర్మపై మెగాస్టార్ తమ్ముడు నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు

రాంగోపాల్ వర్మపై మెగాస్టార్ తమ్ముడు నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ పెద్ద వెధవ అని ఆయన అన్నారు. కాపు కులాన్ని తాకట్లు పెట్టే హక్కు తమకు ఎక్కడిదని నాగబాబు ప్రశ్నించారు. వర్మ తన అవసరాల కోసం ఎంతటికైనా దిగజారుతారని నాగబాబు ఫైర్ అయ్యారు.
ప్యాకేజీ తీసుకునేంత ఖర్మ...
ఒక్కో సినిమాకు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే పవన్ కల్యాణ్ కు ప్యాకేజీ తీసుకునే అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతల తాతలు వచ్చి పవన్ కల్యాణ్ కు ప్యాకేజీ ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. వర్మ నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని నాగాబాబు హెచ్చరించారు.
Next Story

