Wed Mar 18 2026 12:43:23 GMT+0530 (India Standard Time)
నేడు పద్మవిభూషణ్ అందుకోనున్న చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నేడు పద్మవిభూషణ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా అవార్డును అందుకోనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నేడు పద్మవిభూషణ్ అవార్డును అందుకోనున్నారు. ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డును అందుకోనున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.
కుటుంబ సభ్యులతో కలసి....
ఈ ఏడాది రిపబ్లిక్ డే నాడు కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డును ఆయన ఇప్పటి వరకూ అందుకోలేదు. ఈరోజు అవార్డును తీసుకోవడానికి చిరంజీవి తన సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసనతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు.
Next Story

