Mon Mar 16 2026 04:25:18 GMT+0530 (India Standard Time)
మోదీతో కలసి మెగాస్టార్?
ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొననున్నారు. వచ్చే నెల 4వ తేదీన మోదీ భీమవరానికి రానున్నారు

ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొననున్నారు. వచ్చే నెల 4వ తేదీన మోదీ భీమవరానికి రానున్నారు. ఆయన ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం భీమవరంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రత్యేక ఆహ్వానం....
అయితే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భీమవరం సభకు తాను వస్తానని ఈ సందర్బంగా చిరంజీవి కిషన్ రెడ్డితో చెప్పినట్లు తెలిసింది. చిరంజీవి సొంత జిల్లా కావడంతో ఆయనకు ప్రత్యేక ఆహ్వానాన్ని కిషన్ రెడ్డి అందించారు.
Next Story

