Thu Mar 19 2026 19:41:21 GMT+0530 (India Standard Time)
శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఉదయం కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఉదయం కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ఆయనకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వాగతం పలికారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో చిరంజీవికి వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు.
నిన్న రాత్రి చేరుకుని...
పుట్టిన రోజున శ్రీవారిని దర్శించుకునేందుకు నిన్న రాత్రి చిరంజీవి కుటుంబ సభ్యులతో కలసి తిరుమలకు చేరుకున్నారు. రాత్రి తిరుమలలో బస చేసిన చిరంజీవి ఉదయాన్నే స్వామి వారిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. చిరంజీవికి ఆలయ అధికారులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. ఆయనకు దగ్గరుండి దర్శనం చేయించారు.
Next Story

