Sun Dec 14 2025 11:32:38 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలో జగన్ ను కలవనున్న చిరంజీవి !
మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగనున్నారు. సినిమా టికెట్ల రేట్ల విషయంపై చర్చించేందుకు త్వరలోనే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నట్లు సమాచారం. అయితే..

ఏపీలో సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు పై రచ్చ జరుగుతూనే ఉంది. తెలంగాణలో సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఏపీ ప్రభుత్వం మాత్రం థియేటర్లపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు టికెట్లు అమ్మలేక.. ఇప్పటికే చాలా థియేటర్లు స్వచ్ఛందంగా మూతపడగా.. తనిఖీల పేరుతో మరికొన్ని థియేటర్లు మూతపడ్డాయి. సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో.. టికెట్ల రేట్లు తగ్గింపుపై డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగనున్నారు. సినిమా టికెట్ల రేట్ల విషయంపై చర్చించేందుకు త్వరలోనే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నట్లు సమాచారం. అయితే.. జగన్ ను కలవడానికి ముందుగా.. ప్రస్తుతం ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్న పేర్నినానితో చిరంజీవి భేటీ అయి టికెట్ ధరల వ్యవహారం, చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. టికెట్ ధరల తగ్గింపుపై పునరాలోచన చేయాల్సిందిగా చిరంజీవి కోరనున్నారట.
Next Story

