Mon Dec 08 2025 20:22:32 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ సీఎం జగన్ కు చిరంజీవి అప్పీల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు మెగాస్టార్ చిరంజీవి అప్పీల్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు మెగాస్టార్ చిరంజీవి అప్పీల్ చేశారు. ఆన్ లైన్ టిక్కెట్ విధానాన్ని అమలు చేయండి కానీ టిక్కెట్ ధరను పెంచాలని చిరంజీవిని కోరారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. దేశమంతా జీఎస్టీ ఒకేమాదిరి వసూలు చేస్తున్నప్పుడు టిక్కెట్ ధరల్లో కూడా అదే మాదరిని ఒకే ధరను నిర్ణయించడం ఆహ్వానిస్తున్నామని తెలిపారు. టిక్కెట్ల అమ్మకాల్లో పారదర్శకత కోసం ఆన్ లైన్ టిక్కెట్ల విధానాన్ని ప్రవేశ పెట్టడం స్వాగతిస్తున్నామని తెలిపారు.
టిక్కెట్ ధరలను....
సినిమా రంగంపై వేలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని చిరంజీవి అన్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని తగ్గించిన టిక్కెట్ ధరలను పెంచాలని చిరంజీవి కోరారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉన్నప్పుడే చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని చిరంజీవి అన్నారు. టిక్కెట్ ధరలపై పునరాలోచించాలని చిరంజీవి కోరారు.
Next Story

