Sun Mar 15 2026 13:24:05 GMT+0530 (India Standard Time)
ఆల్ ది బెస్ట్ తమ్ముడూ.. చిరంజీవి ఆశీర్వాదం
జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి ఐదు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు

జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి ఐదు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్ నగర శివార్లలో షూటింగ్ లో ఉన్న చిరంజీవిని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో పాటు నేతలు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో రాజకీయాల పట్ల చిరంజీవి అడిగి తెలుసుకున్నారు. చిరంజీవి పాదాలకు నమస్కరించి ఆయన నుంచి పవన్ కల్యాణ్ ఆశీర్వాదం తీసుకున్నారు.
ఐదు కోట్ల విరాళం...
అయితే ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి విజయం సిద్ధించాలని చిరంజీవి ఆకాంక్షించినట్లు చెబుతున్నారు. దీంతో పాటు తన వంతుగా జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని ఆయన అందచేశారు. ఆల్ ది బెస్ట్ అంటూ తమ్ముడికి చిరంజీవి ముందస్తు అభినందనలు తెలిపారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

