Mon Mar 16 2026 17:46:02 GMT+0530 (India Standard Time)
జగన్ తో భేటీ అయిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి క్యాంప్ కార్యాలయానికి బయలుదేరివెళ్లారు.

మెగాస్టార్ చిరంజీవి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి బయలుదేరివెళ్లారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన చిరంజీవి అక్కడి నుంచి జగన్ వద్దకు వెళ్లారు. ఆయనతో లంచ్ మీటింగ్ లో పాల్గొంటారు. సుమారు రెండు గంటల పాటు జగన్ తో చిరంజీవి భేటీ అయ్యే అవకాశముంది.
ఇండ్రస్ట్రీ పెద్దగానే....
జగన్ తో తాను ఇండ్రస్ట్రీ పెద్దగానే చర్చించడానికి వచ్చానని చిరంజీవి తెలిపారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు తాను వచ్చానని చెప్పారు. జగన్ తో అన్ని విషయాలను చర్చిస్తానని, తర్వాత మీడియాకు వివరిస్తానని చిరంజీవి తెలిపారు. జగన్ తో లంచ్ చేసిన తర్వాత చిరంజీవి తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు.
Next Story

