Sat Dec 13 2025 22:43:23 GMT+0000 (Coordinated Universal Time)
మంగళగిరిలో నేడు మెగా జాబ్ మేళా
నేడు మంగళగిరిలో మెగా జాబ్ మేళా జరగనుంది.

నేడు మంగళగిరిలో మెగా జాబ్ మేళా జరగనుంది. ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మంగళగిరి వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా జరగనున్నది. ఈ జాబ్ మేళాలో పదికి పైగా కంపెనీలు పాల్గొననున్నాయి, మొత్తం 262 మందికి పైగా ఖాళీలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, B.Tech వంటి అర్హతలున్న 18 నుండి 25 ఏళ్ల మధ్య వయస్సు గల నిరుద్యోగులు అవసరమైన ఆధార్, సర్టిఫికేట్లు, ఫోటోలు, బయోడేటాతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకాగలరు.
రిజిస్ట్రేషన్ కోసం...
ఎంపికయ్యే వారికి నెలకు పది వేల నుంచి ముప్ఫయి వేల వరకు వేతనాలు లభించనున్నాయి.రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు నైపుణ్యం పోర్టల్ (naipunyam.ap.gov.in) ద్వారా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అదనపు వివరాల కోసం 8074597926, 7780588993, 9347372996 నంబర్లను సంప్రదించవచ్చు. స్థలంలోనే ప్రత్యక్ష రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Next Story

