Wed Mar 18 2026 07:24:48 GMT+0530 (India Standard Time)
నేడు పిఠాపురంలో మెగాహీరో వరుణ్ తేజ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపు కోసం పిఠాపురం నియోజకవర్గంలో మెగా హీరో వరుణ్ తేజ్ ప్రచారాన్ని నిర్వహించనున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపు కోసం పిఠాపురం నియోజకవర్గంలో మెగా హీరో వరుణ్ తేజ్ ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈరోజు ఆయన పిఠాపురంలో పర్యటించి తన బాబాయి పవన్ కల్యాణ్ గెలుపునకు ప్రచారం నిర్వహిస్తారు. పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే పార్టీకి చెందిన స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో వరుణ్ తేజ్ ప్రచారం కూడా మరింత ఊపు తెస్తుందంటున్నారు.
బాబాయి కోసం...
ఈరోజు వరుణ్ తేజ్ గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం నుంచి రోడ్ షో ప్రారంభించనున్నారు. రోడ్ షో వన్నె పూడి, కొడవలి, చందుర్తి, దుర్గాడ మీదుగా సాగనుంది. వరుణ్ తేజ్ వస్తుండటంతో పెద్దయెత్తున పార్టీ కార్యకర్తలు అభిమానులు వచ్చే అవకాశముంది. దీంతో పోలీసులు కూడా రోడ్ షో వెళ్లే ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
Next Story

