Sat Mar 07 2026 18:02:09 GMT+0530 (India Standard Time)
పార్ధసారధితో వాళ్లిద్దరూ భేటీ... అందుకేనా?
పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారధితో ఇద్దరు వైసీపీ నేతలు కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది

పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారధితో ఇద్దరు వైసీపీ నేతలు కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాలు పార్ధసారధితో భేటీ అయ్యారు. నాలుగో జాబితా విడుదలవుతున్న సమయంలో వీరిద్దరూ పార్ధసారధితో భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
టిక్కెట్ రాదని...
జంగా కృష్ణమూర్తి కూడా బీసీ నేత. ఆయన ఈసారి గురజాల శాసనసభ టిక్కెట్ ను ఆశిస్తున్నారు. అయితే ఆయనకు వైసీపీ హైకమాండ్ నుంచి హామీ లభించలేదు. అలాగే ఎలీజాకు కూడా చింతలపూడి రాదని తేలిపోయింది. దీంతో ఇరువురు నేతలు పార్ధసారధిని కలిసి టీడీపీలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. ఇద్దరూ విడివిడిగా పార్థసారధితో సమావేశమయినా తమ రాజకీయ భవిష్యత్ పైనే చర్చ జరిపినట్లు తెలిసింది. పార్థసారధి త్వరలోనే టీడీపీలో చేరుతున్న సంగతి తెలిసిందే.
Next Story

