Thu Mar 19 2026 16:22:22 GMT+0530 (India Standard Time)
గవర్నర్ తో ముగిసిన భేటీ
గవర్నర్ తో ఉద్యోగ సంఘాల నేతల భేటీ ముగిసింది. ప్రభుత్వం బకాయీలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను వారు కోరారు

గవర్నర్ తో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం ముగిసింది. ప్రభుత్వం తమ బకాయీలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కలిసి వారు కోరారు. ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను కూడా సకాలంలో చెల్లించడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు గవర్నర్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించి వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
రావాల్సిన ప్రయోజనాలను...
పేరుకుపోయిన జీపీఎఫ్, మెడికల్ క్లయిమ్స్, డీఏ లతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కే.ఆర్. సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జి. ఆస్కారరావులు తెలిపారు. వెంటనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వానికి మార్గనిర్దేశనం చేయాలని వారు కోరారు. ఎనిమిది మంది ప్రతినిధుల బృందం గవర్నర్ బిశ్వభూషణ్ ను కలసి తమ సమస్యలను వివరించింది.
Next Story

