Mon Mar 23 2026 01:39:13 GMT+0530 (India Standard Time)
సినిమా టిక్కెట్ల ధరల వివాదం.. మరోసారి వాయిదా
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరలపై నియమించిన కమిటీ సమావేశం ముగిసింది

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరలపై నియమించిన కమిటీ సమావేశం ముగిసింది. పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయని హడావిడి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని కమిటీ అభిప్రాయపడింది. వచ్చే నెల మొదటి వారంలో మరోసారి కమిటీ సమావేశం కావాలని నిర్ణయించింది.
వచ్చే నెల మొదటి వారం....
వచ్చే నెల 3వ తేదీన హైకోర్టు డివిజన్ బెంచ్ ముందుకు ఈ అంశం రానుంది. కోర్టు సూచనలు, ఆదేశాలను అనుసరించి ముందుకు వెళ్లాలని కమిటీ అభిప్రాయపడింది. కోర్టు సూచనల మేరకు జాయింట్ కలెక్టర్లతో సంప్రదించి టిక్కెట్ల ధరల పై నిర్ణయం తీసుకోవచ్చని కమిటీ తెలిపింది. వచ్చే నెల మొదటి వారంలో మరోసారి సమావేశం కానుంది.
Next Story

