Wed Mar 18 2026 19:37:38 GMT+0530 (India Standard Time)
రేపు ఎన్డీఏ కూటమి నేతల సమావేశం... శాసనసభ పక్ష నేత ఎన్నిక
రేపు విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల సమావేశం జరగనుంది.

రేపు విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల సమావేశం జరగనుంది. ఎ1 కన్వెన్షన్ సెంటర్ లో ఈ సమావేశం జరుగుతుంది. కూటమి తరుపున గెలిచిన ఎమ్మెల్యేలంతా శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు నాయుడును ఎన్నుకుంటారు. అనంతరం వారి సంతకాలతో గవర్నర్ కు తమ కూటమికి ఉన్న బలాన్ని తెలుపుతూ అధికారికంగా లేఖ అందించనున్నారు. ఆ తర్వాత గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబును ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు.
ప్రమాణ స్వీకారానికి...
ఎల్లుండి 11.27 నిమిషాలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం ఎయిర్పోర్టు సమీపంలోని కేసరిపల్లి వద్ద దాదాపు పథ్నాలుగు ఎకరాల్లో ఇందుకు తగిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిసింది. రెండు లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. కేబినెట్ కూర్పునకు సంబంధించి చంద్రబాబు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు.
Next Story

