Sat Mar 28 2026 00:00:03 GMT+0530 (India Standard Time)
నేడు వారితో పవన్ ప్రత్యేక సమావేశం
జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నేడు జరగనుంది. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం ఈ సమావేశం జరగనుంది.

జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నేడు జరగనుంది. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం ఈ సమావేశం జరగనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో పాల్గొంటారు. పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులతోపాటు పార్టీ జిల్లాల అధ్యక్షులు, వివిధ విభాగాల ఛైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
భవిష్యత్ కార్యాచరణపై.....
ఏపీలో చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై పవన్ కల్యాణ్ ఈ సమావేశంలో నేతలో చర్చించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని ప్రాంతాల్లో సెంటిమెంట్ తలెత్తడం, ప్రజల అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోక పోవడం వంటి అంశాలపై చర్చిస్తారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి జనసేన నుంచి లక్ష రూపాయలు ఆర్థిక సాయాన్ని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా పవన్ నేతలతో చర్చిస్తారు. పెరిగిన విద్యుత్తు ఛార్జీలపై చేపట్టాల్సిన ఆందోళనపై క్యాలెండర్ ను రూపొందించనున్నారు.
Next Story

