Fri Dec 19 2025 02:27:54 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబువి నీచ రాజకీయాలు
టీడీపీ శవరాజకీయాలను చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరోపించారు

టీడీపీ శవరాజకీయాలను చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరోపించారు. ప్రతి దాన్ని రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకుందని అన్నారు. జంగారెడ్డిగూడెంలో వరస మరణాలంటూ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా పనిగట్టుకుని ప్రచారం చేస్తుందని, అక్రమ మద్యమే మరణాలకు కారణమని తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆళ్లనాని అన్నారు.
అనేక కారణాలతో.....
జంగారెడ్డి గూడెంలో వరస మరణాలు సంభవించలేదని ఆళ్ల నాని తెలిపారు వైద్యులు అందించిన నివేదికల ప్రకారం అనారోగ్యం కారణంగా కొందరు మరణించారన్నారు. పది రోజుల్లో ఐదుగురు మరణించారని, వారి మరణాలకు అనేక కారణాలున్నాయని చెప్పారు. కొందరు గుండెపోటుతో, ఇద్దరు దీర్ఘకాల వ్యాధితో, మరో ఇద్దరు అతిగా తాగి మరణించారని ఆళ్ల నాని తెలిపారు. ఇప్పటికైనా చంద్రబాబు నీచ రాజకీయాలను మానుకోవాలని నాని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ సమగ్ర విచారణకు ఆదేశించారన్నారు.
Next Story

