Sun Mar 08 2026 05:46:02 GMT+0530 (India Standard Time)
వెంకయ్య మనవరాలి వివాహ వేడుకల్లో చంద్రబాబు, కేసీఆర్
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి వివాహం జరిగింది. ఈ వివాహానికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి వివాహం జరిగింది. ఈ వివాహానికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. శంషాబాద్ లోని జీఎంఆర్ ఎరీనాలో జరిగిన ఈ వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను దీవించారు.
హైదరాబాద్ కు చెందిన....
వెంకయ్య నాయుడు కుమారుడు హర్షవర్థన్ కుమార్తె నీహారికకు హైదరాబాద్ కు చెందిన రవితేజను ఇచ్చి వివాహం చేశారు. ఈ వివాహ వేడుకలకు అన్ని పార్టీల నుంచి రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ, గవర్నర్ బండారు దత్తాత్రేయ, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు కూడా హాజరయ్యారు.
Next Story

