Sun Dec 07 2025 16:43:07 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ పాఠశాలల్లో కరోనా కలకలం
పీలో వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న అనేక మంది కరోనా బారిన పడ్డారు. విద్యార్థులకు కరోనా సోకింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనాను లైట్ గా తీసుకుంటుంది. రోజుకు 13 వేలకు పైగా కేసులు నమోదవుతున్నా విద్యాసంస్థలకు మాత్రం సెలవులను ప్రకటించడం లేదు. విద్యాసంస్థలను కొనసాగిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ పదే పదే చెబుతున్నారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏపీలో వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న అనేక మంది కరోనా బారిన పడ్డారు.
ప్రకాశం జిల్లాలో....
ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో గత ఐదురోజుల్లో 147 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 18 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రతి రోజూ నమోదవుతున్న కరోనా కేసుల్లో పది శాతం పాఠశాలల్లోనే నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Next Story

