Fri Dec 05 2025 21:19:03 GMT+0000 (Coordinated Universal Time)
Talliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం నగదు పడకపోవడానికి అదే కారణమట
తల్లికి వందనం పథకం అనేక మందికి అందలేదు. అనేక కారణాలతో పథకం వారికి అందకపోవడంతో గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు

తల్లికి వందనం పథకం అనేక మందికి అందలేదు. అనేక కారణాలతో పథకం వారికి అందకపోవడంతో గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తల్లికి వందనం పథకం కింద ఏడాదికి పదమూడు వేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం ఇస్తున్న నేపథ్యంలో అన్ని అర్హతలున్నా తమకు పథకం నగదుఅందలేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక కారణాలను చూపి వారికి నగదు జమ చేయలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తగా తల్లికి వందనం కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం నగదు ఇంకా జమకాక పోవడంతో తల్లిదండ్రులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఆందోళన చెందుతున్నారు.
సచివాలయం సిబ్బందికి...
గ్రామ సచివాలయం సిబ్బందికి వెళ్లి ఫిర్యాదు చేసినా తాము ఫిర్యాదును రెయిజ్ చేశామని, కొద్దిరోజులు ఓపిక పట్టాలని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు.అయినా సరే తల్లికి వందనం పథకం నగదు జమ కావడంతో ఆలస్యం అవుతుండటంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన సూపర్ సిక్స్ లో ఒకటైన తల్లికి వందనం పథకం ఇంకా కొంతమంది తల్లుల ఖాతాలోకి జమ కాక పోవడాన్ని ప్రశ్నిస్తున్నారు.సచివాలయం దగ్గరికి వెళ్లి తల్లికి వందనం నగదు మాకు జమ కాలేదని అడిగితే కొంతమందికి విద్యుత్తు బిల్లు మూడు వందల యూనిట్లు దాటడం అని చూపిస్తుందని చెబుతున్నారు.
విద్యుత్తు అధికారుల వద్దకు...
అయితే అత్యధికంగా వచ్చిన విద్యుత్తు బిల్లులకు సంబంధించి విద్యుత్తు శాఖ అధికారుల వద్దకు వెళ్లి అడిగితే వారు మాత్రం అక్కడ అప్ డేట్ అయిందని చెబుతున్నారు. తల్లిదండ్రులు కరెంట్ ఆఫీస్ లో క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకుని మరలా సచివాలయం దగ్గరికి వచ్చి సమర్పించినా కానీ నగదు జమ కావడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సచివాలయంలో ఇంకా నగదు ఎందుకు జమ కాలేదని అడిగితే తాము గ్రీవెన్స్ పెట్టామని, అది అలాగే ఉందని చెబుతున్నారు. విద్యుత్తు శాఖ సిబ్బంది దీనికి సంబంధించిన డేటా ప్రభుత్వానికి ఇంకా అందించారో లేదు తెలియదంటున్నారు. గ్రీవెన్స్ లో మాత్రం కంప్లైంట్ అలాగే ఉండటంతో నగదు జమ కావడం లేదు. దీనిపై ప్రజాప్రతినిధులతో పాటు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇంటికి వస్తున్న ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు.
Next Story

