Mon Mar 16 2026 00:31:51 GMT+0530 (India Standard Time)
Chiranjeevi : తమ్ముడి కోసం నేడు చిరంజీవి ప్రచారం
పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఇప్పటికే అనేక మంది ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు

పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఇప్పటికే అనేక మంది ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మెగా ఫ్యామిలీలో అనేక మంది అక్కడే ఉండి పవన్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా పవన్ కల్యాణ్ గెలవాలన్న లక్ష్యంతో మెగా కుటుంబంలోని హీరోలతో పాటు టీవీ నటులు కూడా పవన్ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
పిఠాపురంలో...
అయితే పవన్ కల్యాణ్ గెలుపు కోసం మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. పిఠాపురం ప్రజలకు చిరంజీవి పవన్ కల్యాణ్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేయనున్నారు. పవన్ గెలిస్తే పిఠాపురం మాత్రమే కాకుండా రాష్ట్రానికి ప్రయోజనమని ఆయన చెప్పనున్నారు. వీడియో ద్వారా చిరంజీవి పిఠాపురం ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. అయితే ఇప్పటి వరకూ రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి కొంతకాలం క్రితం సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబుకు మద్దతుగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. నేడు పిఠాపురంలో పవన్ గెలుపు కోసం ఆయన వీడియో సందేశాన్ని వదులుతున్నారు.
Next Story

