Sun Dec 14 2025 11:44:26 GMT+0000 (Coordinated Universal Time)
TDP : నేడు ఎన్డీఏ అలయన్స్ మ్యానిఫేస్టో విడుదల
తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మ్యానిఫేస్టో నేడు విడుదల కానుంది

తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మ్యానిఫేస్టో నేడు విడుదల కానుంది. ఎన్డీఏ అలయన్స్ ఉమ్మడి మ్యానిఫేస్టోను ఈరోజు విడుదల చేయనున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ మ్యానిఫేస్టో విడుదల కానుంది. ఇప్పటికే సూపర్ సిక్స్ తో జనంలోకి వెళుతున్న టీడీపీ మరిన్ని హంగులతో మ్యానిఫేస్టోను రూపొందించినట్లు తెలిసింది.
ముగ్గురు నేతలు కలసి...
ఈ మ్యానిఫేస్టో విడుదల కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. మ్యానిఫేస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా నేటి నుంచి చంద్రబాబుతో పాటు మూడు పార్టీలూ ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించాయి. మ్యానిఫేస్టోలో ఏ ఏ అంశాలు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story

