Fri Feb 14 2025 12:48:24 GMT+0000 (Coordinated Universal Time)
మంగళగిరి బాధ్యతను ఆళ్లకు అప్పగించిన జగన్
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ వైసీపీలో చేరారు. ఆయన జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ వైసీపీలో చేరారు. ఆయన కొద్దిసేపటి క్రితం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి తన సోదరుడు, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డితో కలసి వచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ అధినేత జగన్ ను కలసి ఆయనతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జి గంజి చిరంజీవి కూడా పాల్గొన్నారు.
అప్పగించిన బాధ్యతను...
ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంగళగిరిలో వైసీపీని గెలిపించే బాధ్యతను జగన్ అప్పగించినట్లు తెలిసింది. అభ్యర్థిని మార్చడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. తిరిగి పార్టీ నేతలు బుజ్జగించడంతో ఆయన వైసీపీలోకి వచ్చి చేరారు. జగన్ నిర్ణయాన్ని ఆయన సమర్థించినట్లయింది. మంగళగిరిలో పార్టీ విజయానికి తనవంతు కృషి చేస్తానని ఆళ్ల జగన్ కు చెప్పినట్లు సమాచారం.
Next Story