Mon Feb 09 2026 18:23:57 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్..7,673 పోస్టులు భర్తీకి?
ఏపీఎస్ ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలకు భర్తీ చేయాలని యాజమాన్యం నిర్ణయించింది

ఏపీఎస్ ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలకు భర్తీ చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. అయితే అందుకు ప్రభుత్వం నుంచి అనుమతిని కోరుతూ లేఖ రాసింది.ఆర్టీసీలో 7, 673 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వాన్ని కోరిన ఆర్టీసీ పాలకమండలి ప్రభుత్వం నిర్ణయం కోసం వేచి చూస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ సంస్థలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఆర్టీసీలో ఉన్న...
ఖాళీగా ఉన్న 7673 రెగ్యులర్ పోస్టుల నియామకానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆర్టీసీ పాలకమండలి సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. వీటిలో 3673 డ్రైవర్ పోస్టులు, 1813 కండక్టర్ పోస్టులు సహా డిపోల్లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న మెకానిక్ లు, శ్రామిక్ లు, తదితర పోస్టుల భర్తీకి అనుమతించాలని ప్రభుత్వాన్ని బోర్డు కోరింది. ఆన్ కాల్ డ్రైవర్ల రోజువారీ వేతనాన్ని రూ.800 నుంచి 1000 రూపాయలకు పెంచాలని నిర్ణయించారు. డబుల్ డ్యూటీ చేసే కండకర్లకు ఇచ్చే మొత్తాన్ని రూ.900కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Next Story

