Thu Mar 19 2026 03:01:32 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమల లడ్డూ వివాదంపై ఏఆర్ కంపెనీ ఏమందంటే?
తిరుమల లడ్డూ వివాదంపై దానిని తయారు చేసిన కంపెనీ యాజమాన్యం స్పందించింది. తాము ఎలాంటి కల్తీ నెయ్యిలో చేయలేదని తెలిపింది

తిరుమల లడ్డూ వివాదంపై దానిని తయారు చేసిన కంపెనీ యాజమాన్యం స్పందించింది. తాము ఎలాంటి కల్తీ నెయ్యిలో చేయలేదని తెలిపింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీ ఈ వివరణ ఇచ్చింది. తాము జులై నెలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి పదహారు టన్నుల నెయ్యిని సరఫరా చేశామని తెలిపింది.
కల్తీ చేయలేదంటూ...
నెయ్యి సరఫరాపై తమను తిరుమల తిరుపతి దేవస్థానం వివరణ కోరిందని, తాము ఎలాంటి కల్తీ చేయలేదని చెప్పింది. టీటీడీకి తమ వివరణను పంపామని కూడా ఏఆర్ కంపెనీ తెలిపింది. తాము స్వచ్ఛమైన నెయ్యిని మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేశామంటూ ఏఆర్ కంపెనీ వివరణ ఇచ్చింది.
Next Story

