Thu Dec 18 2025 07:32:52 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంలో నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు

శ్రీశైలంలో నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. మొత్తం 11 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం 9 గంటలకు శ్రీ స్వామి వారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలుకు శ్రీకారం చుడతామని తెలిపారు.
పదకొండు రోజుల పాటు...
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. అనంతరం ధ్వజపటం ఆవిష్కరిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పదకొండు రోజుల పాటు శ్రీశైలంలో వసతి, ఇతర సౌకర్యాలన ఏర్పాట్లను ఉన్నతాధికారులను పర్యవేక్షించారు
Next Story

