Sat Dec 06 2025 00:49:24 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీలోకి మహాసేన రాజేష్
ఈ నెల 16న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో మహాసేన రాజేష్ టీడీపీలో చేరనున్నారు.

ఈ నెల 16న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో మహాసేన రాజేష్ టీడీపీలో చేరనున్నారు. చంద్రబాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల పర్యటనలో ఆయన పెద్దాపురం రానున్నార. అక్కడ మహేసేన రాజేష్ టీడీపీ లో చేరనున్నారు. జనసేన కు దగ్గరగా ఉన్న మహాసేన రాజేష్ ఇటీవల చంద్రబాబును కలసి తాను టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని తెలపడంతో పార్టీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సోషల్మీడియా బాధ్యతలను...
మహాసేన ద్వారా రాజేష్ తూర్పు గోదావరి జిల్లాలో పాపులర్ అయ్యారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా బాధ్యతలను అప్పగించే యోచనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది. ఎన్నికల సమయం దగ్గరపడటంతో సోషల్ మీడియాను మరింత విస్తృతం చేయాలని భావిస్తున్న చంద్రబాబు ఆయనకు బాధ్యతలను అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
Next Story

