Wed Mar 18 2026 21:13:32 GMT+0530 (India Standard Time)
టీడీపీలోకి మహాసేన రాజేశ్
మహాసేన అధ్యక్షుడు రాజేశ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. సామర్లకోటలో జరిగిన సభలో చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు

మహాసేన అధ్యక్షుడు రాజేశ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. సామర్లకోటలో జరిగిన సభలో చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. చంద్రబాబు మహాసేన రాజేశ్ ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజేశ్ సేవలను పార్టీ వినియోగించుకుంటుందని, సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు.
పశ్చాత్తాపం ప్రకటించి...
అలాగే మహాసేన రాజేశ్ మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును దళిత ద్రోహిగా భావించి జగన్ కు మద్దతు ఇచ్చామన్నారు. తాము చంద్రబాబును అపార్థం చేసుకున్నామని పశ్చాత్తాపం ప్రకటించారు. ఎస్సీలకు చంద్రబాబు 27 సంక్షేమ పథకాలను అమలు చేస్తే, జగన్ అధికారంలోకి వచ్చి వాటిని రద్దు చేశారని రాజేశ్ ఆరోపించారు. చీకటి వచ్చాకే వెలుగు విలువ తెలుస్తుందన్న రాజేశ్ జగన్ తుగ్లక్ పాలన చూసిన తర్వాత చంద్రబాబు పాలన రామరాజ్యం అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
Next Story

