Sun Feb 01 2026 23:16:40 GMT+0000 (Coordinated Universal Time)
నేడు రైతుల మహాపాదయాత్రలో జనసేన
రాజధాని రైతుల మహాపాదయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో మహాపాదయాత్ర కొనసాగుతుంది.

రాజధాని రైతుల మహాపాదయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో మహాపాదయాత్ర కొనసాగుతుంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు మహా పాదయాత్రను ఈ నెల 1వ తేదీన ప్రారంభించారు. నేటికి పాదయాత్ర 26వ రోజుకు చేరకుంది. అయితే ఈరోజు రైతుల మహాపాదయాత్రకు జనసేన సంఘీభావం తెలపనుంది.
నాదెండ్ల సంఘీభావం....
నెల్లూరు లో జరుగుతున్న రైతుల మహాపాదయాత్రలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొననున్నారు. ఆయన రైతులతో కలిసి పాదయాత్ర చేస్తారు. ఇప్పటికే బీజేపీ నేతలు పాదయాత్రలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు.
Next Story

