Wed Mar 18 2026 05:21:50 GMT+0530 (India Standard Time)
బారీ వర్షాలను లెక్కచేయకుండా?
భారీ వర్షాలను సయితం లెక్క చేయకుండా అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగుతుంది.

భారీ వర్షాలను సయితం లెక్క చేయకుండా అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగుతుంది. నేటికి 27వ రోజుకు మహాపాదయాత్ర చేరుకుంది. నెల్లూరు జిల్లాలో మహా పాదయాత్ర కొనసాగుతుంది. ఈరోజు నెల్లూరు జిల్లాలో 12 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర కొనసాగుతుంది. జిల్లాలోని అంబాపురం వద్ద నేటి యాత్ర ముగియనుంది.
రాజధానిని అమరావతిలోనే...
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రైతులు ఈనెల 1వ తేదీన మహాపాదయాత్ర ప్రారంభించారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరిట కొనసాగుతున్న యాత్ర డిసెంబరు 15వ తేదీన తిరుమలలో ముగియనుంది. రైతుల మహాపాదయాత్రకు అన్ని పార్టీలూ సంఘీభావం తెలిపాయి. బీజేపీ, జనసేన పార్టీలు కూడా యాత్రకు తమ మద్దతును ప్రకటించాయి.
Next Story

