Sun Mar 22 2026 15:23:23 GMT+0530 (India Standard Time)
35వరోజుకు చేరుకున్న మహా పాదయాత్ర
రాజధాని రైతుల మహాపాదయాత్ర నేడు 35వ రోజుకు చేరుకుంది. తిరుమలలో ఈ యాత్ర ఈ నెలలోనే ముగియనుంది.

రాజధాని రైతుల మహాపాదయాత్ర నేడు 35వ రోజుకు చేరుకుంది. తిరుమలలో ఈ యాత్ర ఈ నెలలోనే ముగియనుంది. నెల్లూరు జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుంది. భారీ వర్షాల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న యాత్ర గత మూడు రోజుల నుంచి నిరవధికంగా కొనసాగుతుంది. నిన్న యాత్ర నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది.
స్పందన పెరుగుతుండటంతో...
ఈరోజు పుట్టంరాజు కండ్రిగ నుంచి బయలుదేరనున్న యాత్ర దాదాపు 12 కిలోమీటర్ల మేర సాగనుంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ చేపట్టిన ఈ యాత్రకు మూడు జిల్లాలో ప్రజల నుంచి స్పందన కన్పించింది. దీంతో వారు మరింత ఉత్సాహంగా యాత్రను చేస్తున్నారు.
Next Story

