Sun Mar 22 2026 15:24:04 GMT+0530 (India Standard Time)
నేడు మహా పాదయాత్ర మళ్లీ ప్రారంభం
అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్ర ఈరోజు ప్రారంభమవుతుంది. రెండో రోజుల విరామం అనంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.

అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్ర ఈరోజు ప్రారంభమవుతుంది. రెండో రోజుల విరామం అనంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. భారీ వర్షాల కారణంగా పాదయాత్రను రైతులు రెండు రోజుల పాటు నిలిపేశారు. నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న యాత్ర ఈరోజు 12 కిలోమీటర్ల మేరకు సాగే అవకాశముంది. డిసెంబరు 15 వ తేదీ నాటికి పాదయాత్ర తిరుమలకు చేరుకోవాల్సి ఉంది.
నాలుగు రోజులు...
న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో జరుగుతున్న ఈ పాదయాత్రకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటి వరకూ భారీ వర్షాల కారణంగా రైతులు నాలుగు రోజుల పాటు పాదయాత్రకు విరామం ప్రకటించారు.
Next Story

