Thu Mar 19 2026 05:48:49 GMT+0530 (India Standard Time)
నేడు ద్వారకా తిరుమలకు రైతుల పాదయాత్ర
అమరావతి రైతుల మహాపాదయాత్ర కు నేడు ప్రారంభమయింది. 19వ రోజున మహాపాదయాత్ర ప్రారంభమయింది.

అమరావతి రైతుల మహాపాదయాత్ర కు నేడు ప్రారంభమయింది. 19వ రోజున మహాపాదయాత్ర ప్రారంభమయింది. పెరుగుగూడెం నుంచి బయలుదేరి పాదయాత్ర మధ్యహ్నానికి తిమ్మాపురం చేరుకుంటుంది. అక్కడ భోజన విరామానికి ఆగుతారు. అనంతరం తిమ్మాపురం నుంచి బయలుదేరి రాత్రికి ద్వారక తిరుమల కు చేరుకుంటుంది. మొత్తం 15 కిలోమీటర్లు ఈరోజు నడవాలని రైతుల లక్ష్యంగా పెట్టుకున్నారు.
దెందులూరు వద్ద...
రేపు ఉదయం ద్వారకా తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం తిరిగి రైతులు తమ పాదయాత్రను ప్రారంభిస్తారు. కొవ్వలి నుండి దెందులూరు గ్రామంలోకి రైతుల పాదయాత్ర ప్రవేశించినప్పుడు పెద్దయెత్తున వారికి స్వాగతం లభించింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దయెత్తున పాదయాత్రకు స్వాగతం పలికారు.
Next Story

