Fri Dec 05 2025 13:55:00 GMT+0000 (Coordinated Universal Time)
MahaNadu : కడప మహానాడులో రాయలసీమ రుచులు.. వింటేనే.. నోట్లో లాలాజలం ఊరుతుందిగా?
కడపలో మహానాడు ప్రారంభం అవుతుంది. మొత్తం మూడు రోజుల పాటు జరిగే మహానాడుకు కోం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

కడపలో మహానాడు ప్రారంభం అవుతుంది. మొత్తం మూడు రోజుల పాటు జరిగే మహానాడుకు కోం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి మహానాడులో పాల్గొనేందుకు కడప కు కార్యకర్తలు రావడం ప్రారంభమవుతుంది. దీంతో మహానాడు ప్రాంగణం వద్ద, కడప జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదారుగురు ఎస్పీ స్థాయి అధికారులు మహానాడు పర్యవేక్షణ బాధ్యతను తీసుకున్నారు. మహానాడు మూడు రోజుల పాటు అంటే ఈ నెల 27వ తేదీన ప్రారంభమై29వ తేదీన ముగియనుంది. మూడు రోజుల పాటు కడప నుంచే పరిపాలన జరుగుతుంది. ముఖ్యమంత్రి నుంచి మంత్రివర్గం దాదాపు అక్కడే ఉండటంతో అక్కడి నుంచే పాలన అందించనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే పార్టీ నేతలు చేశారు.
భోజనం అంటే...
ఇక మహానాడు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది భోజనాలు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అంటే భోజనం విషయంలో రాజీ ఉండదు. తృప్తిగా కార్యకర్తలకు భోజనాలు పెట్టే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే. అత్యంత పకడ్బందీగా భోజన ఏర్పాట్లు చేయడంలో మంచి అనుభవం ఉన్న పార్టీ కూడా అది. రాష్ట్రంలోని అన్ని రకాల రుచులను ఎక్కడ పెట్టినా వండి వడ్డించడం మహానాడులో ప్రతి ఏడాది జరిగేదే. అదే సమయంలో ఎక్కడ మహానాడు జరిగితే అక్కడ ఫేమస్ అయిన వంటకాలు మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అందించడం కూడా ఒక్క టీడీపీలోనే సాధ్యమవుతుంది. భోజన ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేస్తారు. కార్యకర్తలు, నేతలు, మంత్రులు, అధికారులు, పోలీసులు ఇలా విడివిడిగా వారికి కౌంటర్లతో పాటు వివిద ప్రదేశాల్లో ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తారు.
నిపుణులైన వంటగాళ్లు...
కడప జిల్లాలో జరిగే మహానాడులోనూ అదరిపోయే వంటకాలు సిద్ధం చేస్తున్నారు. దాదాపు ఇరవై రెండు రకాల వంటకాలు సిద్ధమవుతున్నాయి. కడపలో ప్రసిద్ధి చెందిన వంటకాలతో పాటు ఇరవై రెండు రకాల మెనూను సిద్ధం చేసినట్లు తెలిసింది. రోజులకు వేలాది మందికి టిఫిన్లతో పాటు స్నాక్స్ రెండు పూట భోజన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. మూడు రకాల చెట్నీలు కారంపొడి మామూలే. కాఫీ, టీలు మామూలే. వచ్చిన కార్యకర్త నుంచి నేతలు, మంత్రులు వరకూ ఇక్కడే భోజనాలు చేయనుండటంతో వారికోసం ప్రత్యేకంగా తయారు చేయడానికి ఇప్పటికే వంట తయారు చేసేవాళ్లు కడపకు చేరుకున్నారు. వారికి ప్రత్యేకంగా రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో అక్కడే వంటకాలు ప్రారంభించనున్నారు. కూరగాయలు తరగడం దగ్గర నుంచి వంటలు సిద్ధమయ్యే వరకూ ఆ రెండు ఎకరాల్లోనే చేయాలని, వెజ్, నాన్ వెజ్ లకు ప్రత్యేకంగా నిపుణులైన వారిని రప్పించారు.
ఇదే మెనూ...
కడపలో మహానాడులో బ్రేక్ ఫాస్ట్ కింద కడప ఎర్ర కారం దోసెలతో పాటు ఇడ్లీ, వడ, పొంగల్, పూరిలను సిద్ధం చేయనున్నారు. అలాగే భోజనాల్లోకి వెజిటేరియట్ లో గుత్తివంకాయ కూరతో పాటు దొండకాయ ఫ్రై, పప్పు, సాంబారు, రసం, గడ్డ పెరుగుతో వడ్డించనున్నారు. ఇక నాన్ వెజ్ లో మటన్ కర్రీ, రొయ్యల వేపుడు, చికెన్ వేపుడు, చేపల పులుసు వంటివి సిద్ధం చేస్తున్నారు. అయితే అన్నిజిల్లాలకుచెందిన వారు వస్తుండటంతో రాయలసీమ రుచులతో పాటు కోనసీమా, కోస్తాంధ్రకు సంబంధించిన ప్రత్యేక వంటకాలు కూడా సిద్ధం చేశారు. దీంతో పాటు తూర్పు గోదావరి జిల్లా నుంచి కాకినాడ కాజా, పూతరేకులు, కాళహస్తి పాలకోవా, బాదూషా, మాడగుల హల్వా వంటివి కూడా తెప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ప్రాంతాల పిండి వంటకాలతో పాటు అన్ని ప్రాంతాలకు చెందిన రుచులను మహానాడులో అందించనున్నారు.
Next Story

