Fri Dec 05 2025 23:15:05 GMT+0000 (Coordinated Universal Time)
వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ఈరోజు ఉదయం 8 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా..

ప్రముఖ పుణ్యక్షేత్రం, శైవక్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మొదలైన శివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 4వ తదీ వరకూ 11 రోజుల పాటు జరగనున్నారు. ఈరోజు ఉదయం 8 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటిసారి స్వామి, అమ్మవార్లకు దేవస్థానం పట్టువస్త్రాలను శ్రీకాళహస్తి దేవస్థానం సమర్పించనుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా నేటి నుండి భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనం లభించనుంది. మార్చి 5 నుంచి సర్వ దర్శనాలు పునప్రారంభమవుతాయని ఆలయ అధికారులు తెలిపారు.
మంగళవారం సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరించనున్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆన్ లైన్లో బుకింగ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. నేటి నుంచి మార్చి 4వ తేదీ వరకూ మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులు ఆన్ లైన్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఈఓ లవన్న తెలిపారు. శ్రీఘ్రదర్శనం రూ.200, అతిశీఘ్ర దర్శనం రూ.500, ఉచిత దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
Next Story

