Sun Mar 15 2026 11:31:56 GMT+0530 (India Standard Time)
రేపటి నుంచి శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు
రేపటి నుండి శ్రీశైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి

రేపటి నుండి శ్రీశైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19వతేది నుండి మార్చి 1వతేది వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న బ్రహ్మోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పదకొండు రోజుల పాటు వాహనాలకు 24 గంటల పాటు అనుమతిని ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది.
పట్టువస్త్రాలు...
22 వతేది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 23వతేది రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్ల కు పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్పించనున్నారు. కాలినడకన వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు దేవస్థానం అధికారులు తీసుకుంటున్నారు.
Next Story

