Mon Dec 15 2025 07:24:16 GMT+0000 (Coordinated Universal Time)
నేటితో ముగియనున్న మహాపాదయాత్ర
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ గత నలభై రోజులకు పైగా కొనసాగుతున్న మహా పాదయాత్ర నేటితో ముగియనుంది.

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ గత నలభై రోజులకు పైగా కొనసాగుతున్న మహా పాదయాత్ర నేటితో ముగియనుంది. ఈరోజు సాయత్రం అలిపిరి వద్ద ఈ పాదయాత్రను ముగించనున్నారు. అమరావతి ప్రాంత రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరిట మహాపాదయాత్రను నవంబరు 1వ తేదీన ప్రారంభించారు. వర్షాలకు కూడా లెక్క చేయకుండా యాత్రను సాగించారు. రేపు, ఎల్లుండి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. 17 వ తేదీన తిరుపతిలో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
17న బహిరంగ సభ...
బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు కోర్టు తీర్పు చెప్పే అవకాశముంది. కోర్టు తీర్పు ప్రకారం వారు నిర్ణయం తీసుకోనున్నారు. కాగా అమరావతి రైతుల మహా పాదయాత్ర ముగియనున్న సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.
Next Story

