Sun Mar 15 2026 11:56:02 GMT+0530 (India Standard Time)
నేడు రాజమండ్రికి రైతుల పాదయాత్ర
కొవ్వూరు నుంచి బయలుదేరిన అమరావతి రైతుల మహా పాదయాత్ర నేడు రాజమండ్రికి చేరుకోనుంది

అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్ర నేడు 35వ రోజుకు చేరుకుంది. కొవ్వూరు నుంచి బయలుదేరిన పాదయాత్ర నేడు రాజమండ్రికి చేరుకోనుంది. కొవ్వూరు గామన్ వంతెన మీదుగా బయలుదేరి కాతేరు మీదుగా మల్లయ్య పేట వరకూ ఈ రోజు యాత్ర కొనసాగనుంది. కొవ్వూరు బస్టాండ్ జంక్షన్ నుంచి యాత్ర ప్రారంభమయింది.
14 కిలోమీటర్లు...
ఈరోజు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఈరోజు రాజమండ్రిలో మహా పాదయాత్రలో వంగవీటి రాధా, పరిటాల శ్రీరాంలు పాల్గొంటారు. రైతులకు సంఘీభావాన్ని ప్రకటిస్తారు. వారు నిన్ననే రాజమండ్రి చేరుకున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొంటారు.
Next Story

