Sun Mar 22 2026 15:23:23 GMT+0530 (India Standard Time)
ప్రారంభమయిన మహా పాదయాత్ర
రైతుల మహా పాదయాత్ర మళ్లీ ప్రారంభమయింది. అమరావతి రైతుల మహాపాదయాత్రకు నిన్న విరామమిచ్చారు

రైతుల మహా పాదయాత్ర మళ్లీ ప్రారంభమయింది. అమరావతి రైతుల మహాపాదయాత్రకు నిన్న విరామమిచ్చారు. ఈరోజు తిరిగి ఏలూరు జిల్లా కొత్తూరు నుంచి ప్రారంభమయింది. వారికి సంఘీభావంగా అనేక మంది రైతులతోపాటు వివిధ ప్రజాసంఘాలు, పార్టీల నేతలు వారితో కలసి నడుస్తున్నారు. ఏలూరు జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లాలోకి అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రవేశించబోతుంది.
ఏలూరు జిల్లాలో...
రైతుల మహా పాదయాత్రకు ఏలూరు జిల్లాలో ప్రతి చోటా ఘన స్వాగతం లభిస్తుంది. జనసేన కార్యకర్తలు కూడా తమ జెండాలతో రైతుల మహాపాదయాత్రలో పాల్గొన్నారు. అడుగడుగునా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వారికి సంఘీభావం తెలుపుతున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ చేస్తున్న ఈ యాత్ర అరసవిల్లి వరకూ కొనసాగనుంది. నేడు రైతుల మహాపాదయాత్ర పదహారో రోజుకు చేరుకుంది.
Next Story

