Thu Mar 23 2023 11:30:53 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఈడీ ముందుకు మాగుంట
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయనకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఉదయం పదకొండు ప్రాంతంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది.
అరుణ్ పిళ్లైతో కలసి....
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్ర పిళ్ళైతో కలిపి మాగుంటను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే లిక్కర్ కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే మాగుంట ఈరోజు హాజరవుతారా? లేక కవిత మాదిరి చివరి నిమిషంలో తాను విచారణకు రాలేనని చెబుతారా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story