Sun Mar 08 2026 04:43:55 GMT+0530 (India Standard Time)
తీహార్ జైలుకు మాగుంట రాఘవ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడు మాగుంట రాఘవకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. తీహార్ జైలుకు తరలించారు

ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు జ్యుడీషియల్ రిమాండ్ విధింంచారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రౌస్ అవెన్యూ కోర్టు మాగుంట రాఘవకు మార్చి 4 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన రాఘవను ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.
కస్టడీ ముగియడంతో...
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీ ముగియడంతో మాగుంట రాఘవను జ్యుడియల్ రిమాండ్ విధించడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాగుంట రాఘవ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
Next Story

