Mon Mar 23 2026 12:47:41 GMT+0530 (India Standard Time)
మచిలీపట్నం కోర్టుకు బాంబు బెదిరింపు
మచిలీపట్నం కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది

మచిలీపట్నం కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. న్యాయమూర్తికి బెదిరింపు మెయిల్ రావడంతో కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.కోర్టు పరిసరాలను, న్యాయస్థానంలో బాంబు స్క్కాడ్ తనిఖీలు చేస్తుంది. న్యాయస్థానంలో ఉన్న వారిని బయటకు పంపి తనిఖీలను నిర్వహిస్తున్నారు.
బాంబ్ స్క్వాడ్ తనిఖీలు...
కక్షిదారులను కూడా ఎవరినీ కోర్టు ప్రాంగణంలోకి అనుమతించడం లేదు. అయితే మెయిల్ నేరుగా న్యాయమూర్తికి పంపడంతో ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆకతాయిల పనా? లేక మరేదైనా పనా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతుంది.
Next Story

