Fri Dec 05 2025 09:28:05 GMT+0000 (Coordinated Universal Time)
ఇంటి నుంచి జూలకంటి బయటకు వస్తుండటంతో అడ్డుకున్న పోలీసులు
టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు.

మాచర్ల నియోజకవర్గంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే పోలీసులు నేతలను గృహనిర్భంధంలో ఉంచారు. టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. పోలింగ్ జరిగిన రోజు నుంచే ఆయనను బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. బయటకు వస్తే మరింత ఉద్రిక్తతలు చెలరేగుతాయని భావించి ఆయనను ఇంటి నుంచి పోలీసులు కదలనివ్వడం లేదు.
గృహనిర్భంధంలో ఉన్నారని...
అయితే ఈరోజు జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి బయలుదేరి బయటకు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. బయటకు వెళ్లడానికి వీలులేదని చెప్పారు. తాను ఎన్నికల కమిషనర్ ను కలవాలని, కొన్ని విషయాలు తెలియజేయాలని బ్రహ్మారెడ్డి చెప్పినా బయటకు వెళ్లడానికి వీలులేదని, గృహనిర్భంధంలో ఉన్నారని చెప్పారు. దీంతో ఆయన పోలీసులతో కొంత వాగ్వాదానికి దిగారు.
Next Story

