Sun Dec 08 2024 07:21:03 GMT+0000 (Coordinated Universal Time)
Hema : నటి హేమను సస్పెండ్ చేస్తూ నిర్ణయం.. ఈరోజు ప్రకటించే అవకాశం
నటి హేమ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో మా ప్రెసిడెంట్ మంచు విష్ణు అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయనున్నారు
నటి హేమ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో మా ప్రెసిడెంట్ మంచు విష్ణు అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయనున్నారు. ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీలో సినీనటి హేమ దొరికపోయిన సంగతి తెలిసిందే. ఆ రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ వినియోగించిందని పోలీసులు నిర్ధారించి ఆమెను అరెస్ట్ చేశారు. బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయడంతో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు హేమపై తీసుకోవాల్సిన చర్యలపై సభ్యుల అభిప్రాయాలను కోరారు.
రేవ్ పార్టీలో...
ఎక్కువ మంది సభ్యులు హేమను సస్పెండ్ చెయ్యాల్సిందే అంటూ రిప్లయ్ ఇచ్చారు. మా అసోసియేషన్ కు చెడ్డపేరు రాకుండా ఉండాలంటే ఆమెను సస్పెండ్ చేయాలని ఎక్కువమంది సభ్యులు కోరారు. దీంతో హేమ కు క్లీన్ చిట్ వచ్చేంతవరకు సస్పెండ్ చేయాలని మంచు విష్ణు నిర్ణయించారు. ఈరోజు అధికారికంగా హేమ ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించే అవకాశముంది. నటి హేమ తాను రేవ్ పార్టీకి వెళ్లలేదని బుకాయించినా బెంగళూరు పోలీసులు మాత్రం ఆమెను అరెస్ట్ చేశారు.
Next Story