Sat Jul 12 2025 22:47:50 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్ర ఊటీలో ఇప్పుడు ఎంత చల్లగా ఉందో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ లోని పాడేరు, అల్లూరి జిల్లాల్లో మాత్రం అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి

రెండు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉదయం పది గంటలకు దాటితే బయటకు రావడానికి కూడా భయపడిపోతున్నారు. అనేక మంది ఇంటి నుంచి కాలు బయట పెట్టడం లేదంటే నమ్మాలి మరి. ఒకవైపు ఎండలు.. మరొక వైపు ఉక్కపోతతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెనం మీద వేసిన అట్టులా మాడిపోతున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు.
అతి తక్కువ ఉష్ణోగ్రతలు...
అయితే ఆంధ్రప్రదేశ్ లోని పాడేరు, అల్లూరి జిల్లాల్లో మాత్రం అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ జిల్లాల్లో పదిహేను నుంచి పంధొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అందుకే అరకుకు వచ్చేందుకు పర్యాటకుల సంఖ్య కూడా బాగా పెరిగిందంటున్నారు. అరకు ప్రాంతంలో వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. గత రెండు రోజుల నుంచి వాతావరణం చల్లబడటంతో అరకు అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.
Next Story