Thu Dec 18 2025 18:07:21 GMT+0000 (Coordinated Universal Time)
Ap Politics : నా మీద కులముద్ర వేసినా సరే.. నా మద్దతు ఆ పార్టీకే
ఆంధ్రప్రదేశ్ లో తన మద్దతు ఎన్డీఏ కూటమికేనని లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ తెలిపారు

ఆంధ్రప్రదేశ్ లో తన మద్దతు ఎన్డీఏ కూటమికేనని లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ తెలిపారు. రేపటి నుంచి తనపై కులముద్ర వేస్తారని తెలుసునని, అయినా రాష్ట్ర అభివృద్ధి కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చారు. ఈ కూటమితోనే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కూటమి అధికారంలోకి వస్తే...
ఈ కూటమి అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, పరిశ్రమల స్థాపన జరుగుతుందని జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆ నమ్మకం తనకు ఉన్నందునే ఆ కూటమికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ప్రజలు, మేధావులు, రైతులు ఆలోచించి పిల్లల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని కూటమికి మద్దతివ్వాలని కోరారు. ఈ ప్రకటన చేసినందుకు తనపై కులముద్రతో పాటు, తనను దూషించేవాళ్లు కూడా అనేక మంది బయలుదేరుతారని, అయితే నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
Next Story

