Thu Jul 07 2022 07:21:41 GMT+0000 (Coordinated Universal Time)
పల్నాడు లో టెన్షన్... లోకేష్ పర్యటనతో?

పల్నాడు జిల్లాలో నేడు లోకేష్ పర్యటించనున్నారు. హత్యకు గురయిన జల్లయ్య కుటుంబాన్ని లోకేష్ పరామర్శించనున్నారు. తోకేష్ జిల్లాకు రావడంతో టీడీపీ నేతలు పెద్దయెత్తున ఏర్పాట్లు చేశారు. కొండమోడు నుంచి రావులాపురం వరకూ బైకు ర్యాలీని ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు ఇందుకు అనుమతించలేదు. బైకు ర్యాలీలకు గాని, ప్రదర్శనలకు గాని ఎటువంటి అనుమతులు లేవని పోలీసులు తెలిపారు.
పోలీసుల ఆంక్షలు...
ఈ మేరకు స్థానిక టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే లోకేష్ రాక సందర్భంగా ఖచ్చితంగా ర్యాలీ చేపడతామని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ర్యాలీలు నిర్వహించకుండ అన్ని చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. మొత్తం మీద పల్నాడు జిల్లాలో నేడు టెన్షన్ నెలకొంది.
Next Story