Sat Mar 07 2026 19:49:54 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : అనకాపల్లిలో మద్యం దుకాణాలు మూసివేత
మద్యం వ్యాపారం చేయలేమని యజమానులు అనకాపల్లి జిల్లాలో నిరసన తెలియజేశారు

మద్యం వ్యాపారం చేయలేమని యజమానులు అనకాపల్లి జిల్లాలో నిరసన తెలియజేశారు. అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ ఆఫీస్ వద్ద మద్యం దుకాణాల యజమానులు నిరసన తెలిపారు. తాము వ్యాపారాలు చేయలేమంటూ మద్యం దుకాణాల యజమానులు తెలిపారు. మద్యం దుకాణాలు తాళాలు జిల్లా ఎక్సైజ్ అధికారికి యజమానులు అప్పగించారు.
మార్జిన్ 20 శాతం...
మార్జిన్ 20శాతం అమలు చేయాలంటూ ఎక్సైజ్ డీలర్లు నినాదాలు చేశారు. మార్జిన్ పెంచకుంటే తాము దుకాణాలను నిర్వహించలేమంటూ అనకాపల్లి జిల్లాలో మద్యం వ్యాపారులు తమ దుకాణాలకు వేసిన తాళాలను ఎక్సైజ్ అధికారులకు అందించారు. నష్టాల్లో తాము నడపలేమని చేతులెత్తేశారు. సమస్యలు పరిష్కరించకుంటే దుకాణాలు నిర్వాహకులు నిర్వహించలేమని చెప్పారు
Next Story

