Fri Dec 05 2025 12:40:24 GMT+0000 (Coordinated Universal Time)
తాపీగా జూపార్క్ రోడ్డులో కూర్చున్న చిరుత
తిరుపతిలో చిరుత పులి కనిపించింది. అలిపిరి జూపార్క్ రోడ్డులో కూర్చుని ఉన్న చిరుతపులిని చూసి స్థానికులు భాయందోళనకు గురయ్యారు

తిరుపతిలో చిరుత పులి కనిపించింది. రెండు రోజుల క్రితం కనిపించిన చిరుత మళ్లీ కనిపించిడంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.అలిపిరి జూపార్క్ రోడ్డులో తాపీగా కూర్చుని ఉన్న చిరుతను ఫొటోలు, వీడియాలు తీసిన స్థానికులు వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడమే కాకుండా అటవీ శాఖ అధికారులకు కూడా పంపించారు.
అక్కడే తిరుగుతున్నట్లు...
చిరుత అక్కడే తిరుగుతున్నట్లు అర్థమవుతుందని భావించిన స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అలిపిరి జూపార్క్ వద్ద నుంచి బైక్పై వెళ్తున్న యువకులకు చిరుత కనిపించడంతో వారు అప్రమత్తమై దాని నుంచి తప్పించుకున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ప్రాంతంలో వెళ్లేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Next Story

