Wed Jan 28 2026 22:11:20 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో మళ్లీ చిరుతపులి
తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ చిరుతపులి కనిపించింది. దీంతో భక్తులు భయాందోళనలకు గురి అవుతున్నారు

తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ చిరుతపులి కనిపించింది. దీంతో భక్తులు భయాందోళనలకు గురి అవుతున్నారు. ఘాట్ రోడ్డులో చిరుతపులి కనిపించడంతో ఈ విషయాన్ని వాహనంలో ఉన్నవారు చూసి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ద్విచక్ర వాహనంపై ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తున్న వారికి టీటీడీ అధికారులు హెచ్చరికలు జారీ చే
ఫస్ట్ ఘాట్ రోడ్డులో...
తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఫస్ట్ ఘాట్ రోడ్ లో కారులో వెళ్తున్న భక్తులకు చిరుత పులి కనిపించింది.దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. కాలినడన వచ్చే భక్తులను కూడా అప్రమత్తం చేశారు. బృందాలుగా మాత్రమే వెళ్లాలని, ఒంటరిగా కాలినడకన తిరుమల కొండకు చేరుకునే ప్రయత్నం చేయవద్దని తెలిపారు.
Next Story

